అద్భుతమైన నీతి కథ


ఒకరోజు శ్రీ కృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్క తో ఒక పెద్ద పడవలో ప్రయాణిస్తున్నాడు... ఆ పడవలో కుక్కకు సౌకర్యవంతంగా లేదేమో ఎక్కినప్పుడు నుండి మొరగడం ప్రారంభించింది... అలా మొరిగి మొరిగి అల్లరి చేస్తూనే ఉంది ఎంతసేపటికి ఆపక పోయేసరికి అక్కడున్న వారికంత విసుగు ລ້໖໖... రాయల వారు కూడా ఆ కుక్క ని చూసి విసుక్కున్నారు.. ఆ కుక్క ని అదుపులో పెట్టడం ఎవరి తరం కాలేదు.. తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతి ఇస్తే నేను దీనిని అదుపు చేస్తాను అన్నాడు.. రాయలవారు సరేనన్నారు...

వెంటనే రామకృష్ణుడు ఆ కుక్కను ఎత్తుకుని తీసుకొని పోయి నదిలో పడేసాడు.. అక్కడున్న వారందరూ రామకృష్ణుడు ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నారు... అక్కడ నదిలో పడి పోయిన కుక్క మాత్రం ప్రాణభయంతో కష్ట పడి ఈదుతూ ఉంది.. కాసేపు అయ్యాక కుక్కని మళ్లీ నదిలో నుండి పైకి తీసి పడవపై వదిలేశాడు రామకృష్ణుడు.... అంతే ఆ కుక్క ఒక మూలకు పోయి మురగ కుండ అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది..

అక్కడున్న వారే కాకుండా ఆశ్చర్యపోవడం రాయలవారు వంతు అయింది.. రాయల వారు ఆశ్చర్యంతో "ఏం మాయ చేసావు రామకృష్ణ" అని అడిగారు.. అప్పుడు రామకృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి మహారాజా ఈ లోకంలో లో అందరూ తను ఉన్న స్థితి కి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడుతుంటారు. నీటిలో పడేసాక అంతకు ముందు తన ఎంత సురక్షిత ప్రదేశంలో ఉందో అర్థమై కుక్కకి జ్ఞానోదయం అయింది.. అలాగే మన పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించిన వాటి విలువ అర్థం కావడం లేదు కావున కష్టం యొక్క విలువను సమాజంలో ఈ మాత్రం సౌకర్యాలు లేకుండా జీవించేవారిని గురించి తెలియజేయాలి అంటూ రామకృష్ణుడు రాయల వారికి వివరించాడు...

నీతి - పిల్లలకు అన్ని అందించడంలో తప్పులేదు కానీ ఎప్పుడైతే అడిగినవి ఆడదానివి కూడా వాళ్లకి ఇవ్వడం వల్ల వారిలో ఇంకా ఏదో కావాలి అని ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడతారు.. కాబట్టి పిల్లలకు మొదటి నుండి ఉన్నదానితో తృప్తి చెందడం తెలియజేయాలి...