మర్యాద రామన్నగా మారిన వెర్రి రామన్న



ఒకానొక ఊరిలో శివాపురం అనే గ్రామం లో రామన్న అనే యువకుడు ఉండేవాడు. వాడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. ఇంటిలో పడి తినడం, వీధినా తిరగడం అదే పనిగా పెట్టుకున్నాడు. అంతవరకు అయితే పర్వాలేదు కానీ వీడు చేసే పనులు అన్ని తింగర పనులే. వాడి పనులు మాత్రం తల్లి తండ్రులకి విసుగు వచ్చేవి బయటకు వెళ్ళాడు అంటే ఏ తింగరి పని చేసి, ఇంటిమీదకి గొడవలు తెస్తాడు ఏమో అని భయం వాళ్ళకి.

ఊళ్ళో వాళ్లు వాడి వాలకం చూసి పేరుకి ముందు 'వెర్రి ' అని రెండు పేరుని తగిలిచి, వెర్రి రామన్నా అని పిలవడం మొదలు పెట్టారు. తన పేరుకి ముందు వెర్రి అనే రెండాక్సరాలు బిరుదు ఏమో అనుకోని ఏవరైనా రామన్న అని పిలిస్తే పలికేవాడు కాదు. వెర్రి రామన్న అంటే పలికేవాడు. అలా రామన్న కాస్త వెర్రి రామ్మన్నగా స్థిరపడిపోయాడు. భరించినంతకాలం భరించాడు రామన్న తండ్రి, అతనితో పాటు, వెర్రి కూడా పెరిగింది. తను ఎదిగాడు. రేపో, మాపో పెళ్లి చేయాలి. ఇలా ఉంటే వీడికి పిల్లని ఎవరు ఇస్తారు? అందుకని ఎలా అయినా దారిలో పెట్టాలి అని మందలించాడు రామన్న తండ్రి.

ఇన్నాళ్లు తనని పన్నెత్తి మాట అనని తండ్రి, తనని తిట్టడం, కొట్టడం భరించలేకపోయాడు వెర్రి రామన్న. అంతకంటే ' నామాట వినకపోతే నీచావు నువ్వు చావు ' అనే తన తండ్రి మాట రామన్న చెవిలో గింగిరాలు తిరిగాయి. 'ఛీ.. బతకడం కంటే చావడం నయం అనిపించింది వెర్రి రామన్నకి.ఆ రాత్రే ఇంటి నుంచి బయలుదేరి చావడానికి అడవికి వెళ్ళాడు రామన్న. అడవి మధ్యలోకి వెళ్లే సరికి ఆవేశం తగ్గి భయం వేసింది.

అడవిలో పులులు, సింహాలు ఉంటాయి. వాటికి దొరికితే పీక్కు తింటాయి. ఏ బాధ లేకుండా ఎలా చావాలి? అని వెర్రి రామన్న బుర్రకి తట్టలేదు ఎంత ఆలోచించినా. 'ఛీ... చావటం ఎలాగో తెలియని వాడిని అందుకే నాన్న నన్ను చావమని తిట్టాడు అని తనకి తాను తిట్టుకున్నాడు. చావటం ఎలాగో తెలియక కింద ఉంటే ఏ పులో వచ్చి తనని చ౦పుకొని తింటుంది అని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు వెర్రి రామన్న. కొంతసేపుటకి నిద్ర ముంచుకొచ్చింది. ఆ చెట్టు మీద అలానే పడుకున్నాడు. తెల్లవారుజామున అయింది ఉన్నట్టు ఉండి మెలుకువ వచ్చింది వెర్రి రామన్నకి. లేచి కిందకి చూస్తే ఓ స్త్రీ అడవిలో పోతూ ఉంది. ఆమె చుట్టూ పంచ వరణాలతో ఆమె చుట్టూ వెలుగు రేకలు కనిపించాయి. ఆ కాంతి ఆమెకు దారి చూపించాయి.

కొంతదూరం పరిగెత్తి ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు వెర్రి రామన్న. ఆమె ఎవరో కాదు అమ్మల గన్న అమ్మ మన అమ్మ సాక్షత్తు సకల చర సృష్టికి మూలమైన ఆధిపరాసక్తి. ఏయ్!! ఎవరు నువ్వు అడ్డు తప్పుకో అంది ఆ తల్లి. 'తప్పుకుంటా గాని నా ప్రశ్నకు సమాధానం చెబుతావా అన్నాడు వెర్రి రామన్న'.

"అడుగు" అని తల్లి అన్నది. సుఖముగా చచ్చిపోవడం ఎలాగో నాకు కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవా అన్నాడు ..వెర్రి రామన్న. నీకు చచ్చి పోయేంత కష్టం ఏమి వచ్చింది?? అని అడిగింది ఆ తల్లి. తన తండ్రి చచ్చిపోమ్మని అన్నాడు అని చెప్పాడు వెర్రి రామన్న. రామన్న నువ్వు చనిపోవద్దు అంది. నువ్వు రాత్రి అంత కనబడక నీ తల్లి,తండ్రి బాధ పడుతున్నారు అని ఆ తల్లి చెప్పింది. ఈ రోజు నుంచి నువ్వు వెర్రి రామన్నవి కాదు "మర్యాద రామన్నవి". నలుగురికి మంచి చేయు. న్యాయం పక్కన ఉంటూ అందరికి మంచి చేస్తావు వెళ్ళు అంది. ఆమె మాటలకు ఏదో మంత్రం వేసినట్టు బొమ్మలా మారిపోయాడు రామన్న. ఆ మాటలు చెప్పి అదృశ్యం అయింది ఆ దేవి. కొంతసేపటికి రామన్న కోలుకున్నాడు. ఆ క్షణం నుంచి రామన్న మారిపోయాడు. వెర్రి పోయింది.' మర్యాద రామన్నగా ఇంటికి తిరిగి వచ్చాడు.

ఆ క్షణం నుంచి రామన్న మారిపోయాడు. వెర్రి పోయింది.' మర్యాద రామన్నగా ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకుని చూసి తన తల్లి, తండ్రి ఎంతో సంతోషించారు. దేవి వాక్కు పలించింది. అచిర కాలంలోనే మర్యాద రామన్నగా మారిపోయాడు. అందరికి ఏ సమస్య రాకుండా... అందరికి నాయ్యం చేస్తూ మర్యాద రామన్నగా పేరు తెచ్చుకున్నాడు....