పద్యం:25


“అంగడియూరలేదు వరియన్నములేదు శుచిత్వమేమిలే
దంగనలింపులేరు ప్రియమైన వనంబులులేవు నీటికై
భంగపడంగఁ జాల్పడుకృపాపరు లెవ్యరులేరు దాత లె
న్నంగను సున్న గాన పలనాటికిఁ మాటికిఁ బోవనేటికిన్”

అర్థం :

పలనాడు గ్రామాల్లో దుకాణాలు లేవు. తినడానికి వరి అన్నం దొరకదు. ప్రజలలో పరిశుభ్రత లేదు. అందగత్తెలు, అందమైన వనాలు కనపడవు. మంచి నీళ్ల బావులు తవ్వించేవారు లేరు. అక్కడి వారిలో దాన గుణం శూన్యం అని శ్రీనాథుడు పై చాటువులో స్పష్టం చేశాడు. పలనాడు ప్రాంతంలోని కరువు పరిస్థితులకు ఈ చాటుపద్యం నిదర్శనం.