కష్టార్జితం



శివాపురానికి దగ్గరలో ఉన్న పురుషోత్తమపురంలో హరిచంద్రప్రసాద్ అనే ఓ జమిందారు ఉన్నాడు. ఆయన మర్యాద రామన్న గురించి విని ఓ సారి పరిచయం చేసుకుందామని ఒకరోజు శివపురం వచ్చాడు. "జమిందారు గొప్ప ఆడ౦బరం మనిషి. మర్యాద రామన్నను చూడడానికి తాను ఒక్కడే రాలేదు. సకుటుంబ సపరివార సమేతంగా పళ్ళు ఫలాలు, మిఠాయిలు తీసుకొని వచ్చాడు".

"జమిందారుని సాదరంగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసాడు రామన్న ". మీ పేరు విని మీరు ఎంతో గొప్పగా ఉంటారు అనుకున్న. ఇంత సాధాగా ఉన్నారు ఏంటి...?" అని రామన్న వాలకం చూసి చాటుగా అడిగాడు జమిందారు. "ఏదో దేవుడు ఇచ్చిన దానితో తృప్తిగా బతుకుతున్నాను. ఇంతకంటే ఏఁ కావాలి?? అయినా మాలాంటి సామాన్యులకి డాబూ దర్పం ఎందుకు?? అంటూ " ఎదురు ప్రశ్న వేసాడు.

"జమిందారుకి సమాధానం నచ్చలేదు." కాసేపు కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడి "రేపు తప్పకుండ మా ఇంటికి విందుకి రావాలి "అంటూ ఆహ్వానించాడు. అలాగే తప్పకుండా వస్తాను అన్నాడు రామన్న మర్నాడు జమిందారు ఇంటికి వెళ్ళాడు. పెద్ద బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు అమర్చి ఉన్నాయి. వాటిని చూపిస్తూ ఏదో దేవుడు ఇచ్చినంతలో మీకు విందు ఇవ్వడానికి ఈ పదార్ధాలు చేయించాను. మొహమాట పడకుండా తినండి." అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ.... దేవుడు ఇచ్చింది అందరికి చెబుతుంది. కష్టార్జితం మాత్రమే ఎవరిది వారికే చెబుతుంది " అని చురక అంటించాడు రామన్న. రామన్న మాటకి జమిందారు మొహం మాడిపోయింది.

కొన్నాళ్లు తరువాత జమిందారు రమ్మన్నాడు. మళ్ళీ విందుకు ఆహ్వానించాడు. ఆయన మనసు బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళాడు రామన్న. " ఈసారి అరిటాకులో కూర, పప్పు అన్నం చూపించి "ఇది దేవుడు ఇచ్చింది కాదు, నా కష్టారజితం... కమ్మగా ఉంటుంది తిను అన్నాడు." అంతకు ముందు తను అంటించిన చురకలో అంటించిన భావం జమిందారికి అర్థం అయినది అని సంతోషించి తృప్తిగా భోజనం చేసాడు రామన్న. ఆ తరువాత ఆ జమిందారు తన జమి లో ఉండే ప్రజల కష్ట సుఖలలో పాలుపంచుకుంటూ తన ఆడంబరాలను తగ్గించుకొని దాన ధర్మమాలు చేస్తూ దర్మాత్ముడు అనే పేరు తెచ్చుకున్నాడు జమిందారు.