బహుమతికి కారణం


శివరామపాలెం జమీందారు భూపతిరాయుడు, ఒక ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ఒక సాహితీ పోటీ ఏర్పాటు చేశాడు. ఆ పోటీ ఏమిటంటే పరమ శివుడిపైన ఒక గంటలో వంద పద్యాలను ఆశువుగా చెప్పాలి. విజేతకు సరస్వతీ పుత్ర బిరుదుతోపాటు, వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు.
ఆ పోటీలో రజన్ చంద్ర అనే పాతికేళ్ళ యువకుడు. నారాయణా చార్యులు అనే ఒక ఎనభై ఏళ్ళ వృద్ధుడూ సమ ఉజ్జీలుగా నిలిచారు.జామి జమి౦దారు ఎవరిని విజేతగా నిర్ణయిస్తారో నని సభలోనివారంతా అతృతగా చూడసాగారు. జమీందారు కొద్దిసేపు ఆలోచించి, నారాయణాచరులను పోటీలో విజేతగా ప్రకటిం చాడు.
ఆయనకు బిరుదు. సన్మానాలతోపాటు వెయ్యి వరహాలు బహుమతి కూడా ఇవ్వబడింది. సభ ముగిశాక దినాను, అనిందారును పోటీలో రజనీచంద్రకాక, నారాయణా చార్యులు నెగ్గినట్లు ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం వున్నదా? అని అడిగాడు. అందుకు-జమాందారు. "లేకేం దివాన్ జీ. రజనీ చంద్ర యువకుడు ఈ ఏడాది కాకపోయినా వచ్చేఏడాది అప్పుడూ కాకపోతే ఆ పై ఏడాది పోటీలో పాల్గొని నెగ్గే అవకాశం వుంది. పోతే, ఏక్షణమైనా రాలిపోవటానికి సిద్ధంగా వున్న పండుటాకు వంటివాడు నారాయణా చార్యులు.!!
ఇప్పుడు తప్పిపోతే ఆయన సాహిత్యాన్ని సన్మానించుకునే అదృష్టం వచ్చేఏడాది మనకుదక్కకపోవచ్చు కదా!?" అన్నాడు.