భట్టియుక్తి — వేయిని' రెండు వేలుగా మార్చుట



మహారాజు మాటలు విన్న భట్టి బాగా ఆలోచించాడు. మందహాసంతో యిలా అన్నాడు. "మహారాజాః దేవి మనకు వేయి సంవత్సరాల ఆయుస్సు నిచ్చింది. ఆ వరాన్ని పురస్కరించుకొని నేను ఆ వేయిని, రెండువేల సంవత్సరాలుగా నేను కూడ వరాన్ని ఇస్తున్నాను.
"అదెలా?" అని మహారాజు ప్రశ్నించాడు.
"ఏముంది: కాళీమాత వేయి సంవత్సరాల రాజ్య పరిపాలనము చేయుదువని ఆశీర్వదించినదిగదా! నీవు ఆరు మాసములు రాజ్య పరిపాలనము. ఆరు మాసములు దేశ సంచారము చేయుచుందుము. మీరు లేని సమయములో నేను రాచ వ్యవహారములు చూచుచుందును. ఈ విధముగా చేసినచో రెండువేల సంవత్స రములు మనం జీవించవచ్చును గదా!" అని బదులు చెప్పాడు భట్టి.

భట్టి యుక్తికి మహారాజు ఎంతో సంతోషించాడు. భట్టి చెప్పిన ప్రకారముగానే ఆనాటినుండి విక్రమార్కుడు ఆరునెలలు రాజ్యపాలనము, ఆరు నెలలు దేశసంచారం చేయుట ప్రారంభించినాడు.

వింధ్యారణ్యములో నున్న కాళికామాత విగ్రహమును గొనివచ్చి ఒక శుభముహూర్తములో ఉజ్జయినీ నగరంలో ప్రతిష్టించినారు. ఆనాటి నుండి ఆ కాళీమాత నిత్య పూజలతో వెలుగొందుచున్నది. నేటికిగూడ ఆ ఉజ్జయిని నగర కాళీమాత మహా ప్రఖ్యాతితో కొలవబడుచున్నది.