జ్ఞానోదయం


ఒకానొక గ్రామంలో ఓ అవ్వ తన కొడుకు, కోడలు, మనవడితో నివసిస్తూ వుండేది. ఆ అవ్వ బాగా ముసల్ది అయిపోయింది. ఆమెలో శారీరక బలహీనత ఎక్కువ అయిపోయింది. అప్పుడప్పుడు ఆమె చేతిలోంచి గాజు కప్పులు, గాజు పళ్ళేలు జారిపడి పగిలిపోతుండేవి. అది పగిలినప్పుడల్లా కోడలు తన ముసలి అత్తను తిట్టేది. ఇలా తన నానమ్మను తిట్టడం మనవడికి ఇష్టం వుండేదికాదు. కానీ వాడు అమ్మను ఏమీ అనలేక పోయేవాడు.
ఓ రోజు అవ్వ చేతినుండి నగిషీలు చెక్కిన గాజు పళ్ళెం పడి పగిలిపోయింది. కోడలు కోపగించుకుని, తన కొడుకుని పిలిచి డబ్బులు ఇచ్చి అవ్వకు ఓ చెక్క పళ్లెం కొనుక్కు రమ్మనిచేప్పి౦ది. వాడెంతో బాధపడ్డాడు. అన్వ బాధపడుతుందని వాడికి తెలుసు. అయినా తన అమ్మకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
బజారునుండి రెండు చెక్క పళ్ళాలు తెచ్చాడు అవి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. "ఒక- చెక్క పళ్ళెం తెమ్మంటే రెండు ఎందుకు తెచ్చావ్?" అని కోపంగా అడిగింది."మరేం లేదు. ఒకటి అవ్వకి నీవు కూడా ముసలి దానివి అయిపోతే నీకు కూడా ఒకటి. వుండాలి కదా!" అని చెప్పాడు.
కోడలికి జ్ఞానోదయమైంది. ఆ రోజునుండి అత్తగారిని ఎ౦తో ప్రేమగా చూసుకోసాగింది కోడలు, మా తరంలోని మా తల్లితండ్రులను, వృద్ధుల్ని మీరెలాగైతే చూస్తారో... మీ తర్వాత తరం వారు అంటే మీ కొడుకు / మనవలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు.