గురుదక్షిణ


సిద్ధ మహాముని ఆశ్రమంలో శూరసేనుడు, రఘువీరుడు, గుణశేకరుడు అనే శిష్యులుండే వారు.
సిద్ధుడు ముగ్గురికి తన విద్యలన్నింటినీ నేర్పి, వారు అన్ని విద్యలలోనూ ఆరితేరే విధంగా తర్ఫీదు ఇచ్చాడు.
కాలం గడుస్తుంది. సిద్ధుని వయసు పెరుగుతోంది. వృద్ధాప్యం రావడంతో ఆశ్రమ బాధ్యతలను నిర్వహించలేక తన భాధ్యతలను తన శిష్యులలో ఒకరికి అప్పగించాల నుకున్నాడు. అయితే ముగ్గురు శిష్యులలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదు. సరైన సమర్థుడైన శిష్ముడు మాత్రమే ఆశ్రమ బాధ్యతలు నిర్వహించగలడని సిద్ధుడికి తెలుసు. అందువల్ల ఓ ఉపాయం ఆలోచించి శిష్యులని పిలిచి, "నాయనలారా.. ఇంతకాలం మీకు శిక్షణ ఇచ్చి నాకు తెలిసిన విద్యలన్నీ నేర్పాను కాని, నాకు కూడా వృద్ధాప్యం వచ్చేసింది. అందువల్ల నేను పోయేలోగా నాకు మీరు గురుదక్షిణగా ఓ బతికిన లేగదూడను చంపి దాని రక్తాన్ని నాకు గురుదక్షిణగా ఇవ్వాలి' అన్నాడు.

దానికి శూరసేనుడు, రఘువీరుడు "స్వామి... మీరు చెప్పినట్లుగా, మీకు గురుదక్షిణ సమర్పిస్తాం. మాకు సెలవీయండి.. అంటూ లేగదూడ రక్తాన్ని తీసుకురావడానికి వెళ్ళిపోయారు.
గుణశేఖరుడు మాత్రం సిద్ధుడి వద్ద మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు సిద్దుడు గుణశేఖరుడితో "నాయనా.. నీవు గురుదక్షిణ ఇవ్వవా? నీ స్నేహితులిద్దరూ, గురుదక్షిణ ఇప్పడానికి వెళితే నీవు మాత్రం మౌనంగా ఉన్నావేమిటని" అడిగాడు. దానికి గుణశేఖరుడు "గురువర్మా సన్ను క్షమించండి నేను మీకు గురుదక్షిణ ఇవ్వలేని స్థితిలో ఉన్నాను" అన్నాడు విలపిస్తూ "ఏ. ఎందుకు నాయనా...?" అనడిగాడు సిద్ధుడు ."మీరు చెప్పినట్టు గురుదక్షిణ యివ్వవచ్చు. కానీ అది మరో ప్రాణికి హాని తలపెట్టేదిగా ఉంది. ఒక ప్రాణిని నిర్దాక్షణ్యంగా చంపి. మీకు గురుదక్షిణ ఇచ్చేకన్నా గురుదక్షిణ ఇచ్చుకోలేని నిస్సహాయుడనని అనిపించుకోవడమే నాకు మనశ్శాంతిని కలుగజేస్తుంది. కనుక నా తిప్పిదాన్ని మన్నించండి మహాత్మా." అని ప్రాధేయపడ్డాడు.

ఆ మాటలకు సిద్ధుడు ఆనందపారవశ్వం చెందుతూ "లే. నాయనా... యోగనేవాడు సమస్త ప్రాణులయందు దయా. ప్రేమా కలిగిఉండాలి. ఇతర ప్రాణులకు హాని తలపెట్టకుండా పరోపకారం చేయువాడే నిజమైన యోగిపుంగవుడు నిజానికి మీలో యోగ్యుడైన వాడిని ఎన్నిక చేయడం కోసమే నేనీ పరీక్ష పెట్టాను. నేను ఊహించిన అర్హతలన్నీ నీలో ఉన్నాయి. నీవు మాత్రమే ఆశ్రమ బాధ్యతలను నిర్వర్తించగలవు కనుక ఈనాటి నుంచి నువ్వు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించు." అంటూ దీవించాడు.