కాళీమాత సాక్షాత్కారము



"నాయనా: విక్రమార్కా! నీ సాహసానికి నేనెంతెయో ఆనందించుచున్నాను. నీ వంటి సాహసి చిరకాలము యీ ధరిత్రి పాలించుట ధర్మము, కావున నీవు వేయి సంవత్సరములు రాజ్య పరిపాలనము చేయుదువుగాక: నీ సోదరుడు, నీ మంత్రియైన భట్టి కూడ నీ వేయి సంవత్సరముల పరిపాలన ముగిసేవరకు నీ తోడనే ఉండును. అంత్యమున మీరు ఇరువురును నాలోనే ఐక్యమవుదురుగాక!" అని ఆశీర్వదించినది.

విక్రమార్కుడు చేతులు మోక్కి "అమ్మా! నీవీ దుర్గమారణ్యములో ఉండుటకంటే.. రాజ్యములోనే నివసించుచుండుము. మా కుటుంబములేగాక ప్రజలను నిత్యము నిన్ను పూజించుకొందురు" అని ప్రార్థించెను. కాళీమాత సమ్మతించెను. తరువాత విక్రమార్కుడు కొలనే దినములకే- ఆ కాళికామాత విగ్రహంను ఉడ నగరమున పరిసింపజేశారు.

కాళికామాత అనుగ్రహం పొంది, రాజధానికి చేరుకొన్నాడు. జరిగినదంతా భట్టికి తెలియజేసి, దేవి యిచ్చిన వేయి సంవత్సరముల ఆయు పరిమాణమును గూడ తెల్పి "మన ఇరువురము వేయి సంవత్సరములు హాయిగా, విడిపోకుండా జీవించగలము" అని ఆనందంతో భట్టిని కౌగలించుకొన్నాడు.