లోభి


రంగయ్య మహాపిసినారి, ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలేవాడు కాడు. తన పిసినారి తనంతో భార్యా పిల్లలకి కూడా సరైన భోజనం పెట్టేవాడుకాదు. ఎంతసేపూ డబ్బు ఎలా కూడబెట్టాలా? అనే విషయం గురించి ఆలోచించేవాడు రంగయ్య పరిస్థితికి భార్య సీత విస్తుపోయేది.

ఒకసారి ఆ వూరిలో దొంగతనాలు ఉన్నట్టుండి పెరిగి పోయాయి. రోజూ ఏదో ఒక ఇల్లును దొంగలు దోచుకునేవారు. ఇది విన్న రంగయ్యకు కంటిమీద కునుకు పట్టేదికాదు. తను కష్టపడి సంపాదించిన డబ్బు దొంగలు పాలు చేయడం రంగయ్యకు సుతారమూ ఇష్టంలేదు. అందువల్ల ఆ రాత్రికి రాత్రే తన డబ్బునంతటినీ మూట కట్టుకుని భార్యా పిల్లలతో, వేరే తన బంధువుల గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ వూరు వచ్చింది.

ఏరు పొంగి ప్రవహిస్తుండం వల్ల రంగయ్యకు ఏం చేయాలో తోచలేదు. అయితే ఏరుదాటి వెళ్ళకపోతే ఉన్న డబ్బు కాస్తా దొంగల పాలవుతుందన్న ఆలోచనలతో అతడు భార్యా పిల్లలతో ఏ రులోకి దిగాడు. అయితే ఏటి నీటి ప్రవాహం బాగా ఎక్కువగా ఉండటం వల్ల భార్యా, పిల్లలు ఒక్కసారిగా ఏటిలో కొట్టుకుపోయారు.
ఒక చేత్తో డబ్బు సంచి పట్టుకున్న రంగయ్య, భార్యా పిల్లలు మట్టుకు పోయారని బాధపడకుండా, తను సంపాదించిన డబ్బు భద్రంగా ఉందని సంతోషించాడు. ఏటి మధ్యలోకి వచ్చేసరికి ప్రవాహ వేగం మరింత ఎక్కువై పోయింది. వేగానికి తన చేతిలో వున్న డబ్బు మూటను వదిలేశాడు రంగయ్య అంతే రెప్ప పాటులో ఈ విషయాన్ని గ్రహించి, డబ్బు సంచి కొట్టుకుపోతుండ డంతో, దానిని దక్కించుకోవడం కోసం ఏటిలోకి వెళ్ళాడు రంగయ్య అయితే డబ్బు మూట దొరకకపోగా, ఏటిలో పడి కొట్టుకుపోయి మరణించాడు రంగయ్య.