మహా బలుడు


విదర్భ దేశంపై అక్రమంగా దండెత్తిన కళింగరాజు శూరసేనుడు చిత్తుగా ఓడి వెనుదిరిగి పారిపోయాడు। తను విజయానికి కారకులైన సైనిక ముఖ్యులనూ, అధికారులనూ విదర్భ దేశ మహారాజు అనేక విధాల సత్కరించాడు.

మహాబలుడనే సైనికుడు యుద్ధరంగంలో వీర విహారం చేసి, వెయ్యి మందికి పైగా శత్రుసైనికుల కాళ్ళు, చేతులూ నరికాడని ఒక వార్త పుట్టింది. ఇది విన్న వాడి గ్రామస్తులు, మహాబలుడ్ని పూలమాలలతో ముంచెత్తి గ్రామంలో ఊరేగించారు. ఆ సమయంలో మహాబలుడు ఆనందంతో మైమరచి వుండగా జనంలోంచి ఒకడు "మహాబలా! నువ్వు ఆ శత్రు సైనికుల తలలు నరక్కుండా, కాళ్ళూ చేతులూ మాత్రమే సరికి వూరుకున్నావు? అని అడిగాడు.
దానికి మహాబలుడు మీసం మెలివేస్తూ ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ వూరుకుని, చప్పున ఏదో గ్రహించిన వాడిలా "అవును అలాంటి అవకాశం నాకు రాలేదు. వాళ్లందరి తలలూ ముందే తెగనరికి వున్నాయి" అన్నాడు.