మట్టిబుర్ర


రామాపురంలో నివశించే సోమనాథాన్ని ఆ ఊరి ప్రజలంతా మట్టిబుర్ర సోమనాథం అని పిలిచేవారు. కానీ సోమనాథం వారి మాటలను కొంచెం కూడా పట్టించుకునేవాడు కాదు .
ఇలా వుండగా ఒక రోజు పొరుగూరునుండి అల్లుడ్ని చూద్దామని తన మామగారైన సింగినాదం వచ్చాడు. ఆ ఊళ్ళో వారందరూ తన అల్లుడ్ని మట్టి బుర్ర సోమనాధం అని పిలవటం చూసి చాలా బాధపడ్డాడు. జనమంతా తన అల్లుడ్ని అలా ఎందుకు పిలుస్తున్నారో కొంచెం కూడా అర్ధం కాలేదు. వెళ్ళి ఆ విషయాన్ని అల్లుడిని అడుగుదామనకున్నాడు. కానీ అడిగితే అల్లుడేమైనా అనుకుంటాడేమోనని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ఒకరోజు సాయంత్రం ఏదో పనిమీద బయటకు వెళ్తున్న సింగినాదం దగ్గరకు సోమనాదం వచ్చి "మామగారు! ఇంట్లో నాకు మీ పదిరూపాయల నోటు దొరికింది. తీసుకోండి." అని జాగ్రత్తగా దాన్ని అందజేశాడు.
అల్లుడి నిజాయితీకి ఎంతో సంతోషించి సింగినాదం ఆ పదిరూపాయలనోటుని అందుకుంటూ "అవును! ఈ పది రూపాయలనోటు నీకు ఎక్కడ దొరికింది అల్లుడూ?" అని అడిగాడు .
వెంటనే సోమనాధం మరేమీ తడుముకోకుండా "గోడకి తగిలించి వున్న చొక్కా కేబులో మామయ్యా!" అన్నాడు అమాయకంగా.
అంతే! అల్లుడు చెప్పిన ఆ సమాధానం విన్న సింగినాధానికి నెత్తిమీద పిడుగు పడినట్లయి.. ఆ ఊరి ప్రజలంతా తన అల్లుడ్ని మట్టి బుర్ర సోమనాథం అని ఎందుకంటు న్నారో అప్పుడర్ధమైంది.