మోసానికి మోసం


వైజాగ్లో వీరయ్యనే బట్టల వ్యాపారి వుండేవాడు, వీరయ్య బట్టలను మూటగా కట్టుకుని ఊరూరు తిరుగుతూ అమ్మేవాడు.
వీరయ్యకు వయసు పైబడటంతో బట్టల మూట మోసే ఓపిక తగ్గింది. దాంతో వీరయ్య -తక్కువ జీతానికి బట్టలమూట మోసేవాడు ఎవరైనా దొరుకుతాడేమోనని వెతకసాగాడు. చివరకు వీరయ్య కళ్ళు సాంబ అనే వెర్రిబాగులవాడిపై పడింది. సాంబ వూరివాళ్ళు చెప్పే "పనులు చేస్తూ వారిచ్చే చిల్లర డబ్బులతో కాలక్షేపం చేసేవాడు.
వీరయ్య వాడ్ని పిలిచి "ఒరే! బట్టలమూట మోయటానికి రోజూ నాతో వస్తే ఊరివాళిచ్చే "డబ్బులకన్నా ఎక్కువిస్తాను "అన్నాడు. తెలివిలేని సాంబ అందుకు సరేనని ఒప్పుకుని వీరయ్య వెంట తిరగసాగాడు. కానీ వీరయ్య భార్యమాత్రం తెలివిలేనివాడ్ని పనిలో పెట్టుకుంటే మనకే నష్టం అంది. అందుకు వీరయ్య మూట మోయడానికి తెలినివుండనవసరం లేదని సర్దిచెప్పాడు.
ఓ రోజు ఉదయం నీరయ్య సాంబని పిలిచి "ఒరే! ప్రక్క గ్రామంలో ఓ పనుంది నేను. ముందుగా పోయి పని ముగించుకుని ఆ ఊరి రచ్చబండ దగ్గరుంటాను. నువ్వు నెమ్మదిగా బట్టలమూటతో అక్కడకు రా" అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత సాంబ తాపీగా మూట నెత్తిన పెట్టుకుని బయల్దేరాడు. దార్లో వాడికి ఓ దేవత గుడి కన్పించింది.
గుడివద్ద ఓ రైతు పసుపు కుంకుమ ఆవుకి దిద్దుతూ కన్పించాడు అది చూసి సాంబ "ఏమిటి కుంకుమ బొట్టు ఆపుకి దిద్దుతున్నావ్?" అనడిగాడు ప్రక్కవూరి సంతలో ఆవునమ్ము దామని బయల్దేరాను. దేవీ అనుగ్రహముంటే ఎక్కువ ధర వస్తుందని కుంకుమ బొట్టు ఆవుకు పెట్టానన్నాడు.
ఆ మాటలు విన్న సాంబ బుద్రలో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే గుళ్లోకి వెళ్ళి గుప్పెడు పసుపు, కుంకుమ తెచ్చి మూట విప్పి బట్టలకు మొత్తం రాసేశాడు. తర్వాత మూట నెత్తిన పెట్టుకుని హుషారుగా పాటలు పాడుతూ వీరయ్యను చేరుకున్నాడు.
మూటకు పసుపు కుంకుమ అంటుకుని వుండటం చూసి "వీరయ్య ఏమిటిది?" అనడిగాడు సాంబ గొప్పపని చేసినట్లు ముఖం పెట్టి 'అయ్యా! బట్టలు మొత్తం అమ్ముడు పోవాలని వచ్చేదార్లో వున్న దేవతగుడి దగ్గర అమ్మవారి పసుపు కుంకుమల్ల్ని బట్టలకు దిద్దాను" అన్నాడు. ఆ మాటలకు వీరయ్య కంగారుగా మూటవిప్పి, ముద్దగా పసుపు, కుంకుమ రాసున్న బట్టల్ని చూసి "ఓరి దద్దమ్మా ! పసుపు పూసిన బట్టలి ఎవ్వరూ కొనరు. నాటికి ధర ఎక్కువ రాదు' అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.