నిదానమే ప్రదానం


అనగా అనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులుండేవారు. వాళ్ళకు పిల్లలు లేరు. అందువల్ల ఆ భార్యాభర్తలిద్దరూ బాధపడి చివరికొక ముంగినను తెచ్చి పెంచుకున్నారు. ఆ ముంగీన వ్యాకెంతో మచ్చికయి ఇంట్లో పసిపిల్లవానిలా తిరుగుతుండేది. కొంతకాలం అయేసరికి వాళ్ళతో చిన్న పాపాయి పుట్టింది. వాళ్ళు చాళ్ళతో పాటు ఆ ముంగిన కూడా ఎంతో ఆనందపడ్డారు. లేక లేక పుట్టిన పాపాయిని వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ముంగిన కూడా పాపతో ఆడుకుంటుండేది.
ఒకరోజున ఆ పాప అమ్మ ఏటికి నీళ్లకి బయలుదేరింది. పాప అప్పుడు ఉయ్యాల్లో హాయిగా నిద్రపోతున్నది. ముంగిసను పిలచి ఆ అమ్మ పాపకు కాపలాపెట్టి నీళ్లకు బయలుదేరింది. ముంగిస • ఉయ్యాల చుట్టూ తిరుగుతూ గంతులేస్తూ పాప ఎప్పుడు లేస్తుందా ,ఎప్పుడు ఆడుకుందామా అని ఆలోచిస్తూ కాపలా కాస్తున్నది కొంతసేపటికి ఒక పాము ఇంటి దూ లం నుండి ఉయ్యాల గొలుసు కిందకు ప్రాకి గోలుసు గుండా ఉయ్యాలలోకి వస్తుండటం ముంగిన చూసింది.
పాము పరమదుర్మార్థురాలని విషజంతువని ముంగినకు తెలుసు, అందువల్ల పాపకు ఏమయినా ఆపకారం చేస్తుందేమో నని హడలిపోయింది. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదని వెంటనే ఉయ్యాలలోనికి గే౦తి ముంగిస గొలుసులనుండి వస్తున్న పాము నెదుర్కొంది హోరా హోరీగా దానితో పోరాడింది ఎల్లాగయితేనేం దాన్ని ముక్కలు ముక్కలు కొరికి చంపేసింది. పాపకు ప్రమాదం తప్పింది.
పాపను రక్షించానన్న ఆనందంతో ముంగిన పాప అమ్మకోసం వాకిట్లోకి వెళ్లి ఎదురు చూస్తోంది. అంతలో ఆమె భుజాన బిందెత్తుకుని ఆ ఇంటికి వచ్చింది. ముంగిన ఆమె కాళ్లలో ఎంతో ఆనందంగా దూరింది. తన కాళ్ళలోకి అడ్డుపడుతున్న ముంగిసను చూసింది. దాని నోరంతా రక్తంతో తడిసివుంది. పాసను కరిచేసుంటుంది. అదే ఆ రక్తమంతాను అని అనుకున్నది. ఎర్రగా వుండడం చూచింది. ఆమె గుండెలు గుభేలుమన్నాయి. ఆమెకెంతో కోపం వచ్చింది. వాకిట్లోగల కర్రనొక దాన్ని తీసుకుని కోపం తీరా దాన్ని కొట్టి చంపింది.
దాన్నలా చంపేసి చరచరా లోపలకు వరుగెత్తుతూ వెళ్లింది పాపను చూచుకునేటం దుకు పాప చిరునవ్వులొలికిస్తూ ఉయ్యాలలో ఆడుకొంటుంది. ఆ ఉయ్యాలలో పాము ముక్కలు ముక్కలై పడి ఉండడం చూచింది. జరిగిందేమిటో ఆమెకు అర్ధమయ్యింది. తన బిడ్డ ప్రాణాలు కాపాడిన ఉపకారిని తాను చంపేసిన పాపాత్మురాలనని బాధపడింది. తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తే ఈ దారుణం జరిగేది కాదని బాధపడింది. ఆవేశంతో ఉపకారికి అపకారం చేసాను. ఏ పనైనా నిధానంగా ఆలోచించి చెయ్యాలి అని బాధపడింది.