పిచ్చి


రాజమండ్రిలోని ఉమెన్స్ కాలేజీ క్లాసురూంలోకి మొదటిసారి క్లాసు తీసుకోవటానికి. అడుగుపెట్టింది లెక్చరర్ సీతాలక్ష్మి రాగానే క్లాసులోని విద్యార్థినులతో "నాకు విజయవాడ ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్. కాలేజీ నుండి ఇక్కడకు బదిలీ అయ్యింది. విజయవాడలోనూ ఇల్లునుండి బస్టాండుకు నాలుగు కిలోమీటర్లు. నేను ఆటోలో మా ఇంటినుండి విజయవాడ బస్టాపు వచ్చాను. విజయవాడనుండి రాజమండ్రికి రెండువందల కిలోమీటర్లు రాజమండ్రిలో బస్టాప్ నుండి మీ కాలేజికి ఆటోలో వచ్చాను.
గేటు వద్దనుండి నలభై గజాలు నడిచి, రెండు మెట్లు ఎక్కి క్లాసురూమ్ లోకి వచ్చాను. ఇప్పుడు నా వయస్సెంతో మీలో ఎవరైనా చెప్పగలరా? అన్నది సీతాలక్ష్మి వింతగా.

క్లాసులో చాలాసేపు నిశ్శబ్దం అలుముకుంది. చివరికి విజయ అనే ఒక స్టూడెంట్ లేచి మీ వయసు ముప్పైసంవత్సరాలు అన్నది.
"శభాష్! ఇంత కరెక్ట్ ఎలా చెప్పగలిగావ్?" ఆశ్చర్యంగా అడిగింది సీతాలక్ష్మి "ఏమీ లేదండి! మీ తమ్ముడొకడున్నాడు. వాడి వయసు 17 సంవత్సరాలు వాడికి పావువెర్రి, సగం పిచ్చి అందువల్ల దానికి సగం కలిపి మీ వయసు 34 అని అంచనా వేసి చెప్పాను" అంది విజయ నమ్రతగా ఆ మాటకు సీతాలక్ష్మి నివ్వెరపోయింది.