పిచ్చి పుల్లయ్య


వీరేశం అమాయకుడు, వాడంటే అతని తల్లితండ్రులకి ప్రేమ అధికం వాడికి గారాబం కూడా ఎక్కువే! పదేళ్ళు వచ్చినా బడికి వెళ్లేటందుకుఅంగీకరించలేదు వీరేశం.
అందుకు అతడి తల్లితండ్రులు కొడుకుమీద ప్రేమతో ఏమీ అనకపోగా ఏమీ బాధపడలేదు. వీరేశం తండ్రి తన వెంట అన్ని పనులకు, కాలక్షేపాలకు కొడుకును త్రిప్పుతుండేవాడు. అప్పుడప్పుడు తినటానికి ఏమైనా కొనిపెట్టేవాడు.
ఒకనాడు వీరేశానికి అతడి త్రండి బజార్లో బఠానీ గింజలు కొనిపెట్టాడు.వాటిని తినేటందుకు పాట్లం విప్పుకుంటూ పొరపాటున పొట్లం నుండి క్రింద పడేసుకున్నాడు. వీరేశం "ఒరే బాబూ! ఏదైనా వస్తువు కొంటే దాన్ని జేబులో దాచుకోవాలి. అప్పుడది. భద్రంగా వుంటుంది" అంటూ కొడుక్కి అర్థమయ్యేలా నిదానంగా చెప్పాడు తండ్రి. ఆ తర్వాత ఒకసారి వీరేశాన్ని పిల్చి "ఒరేయ్! ఆదెమ్మ ఇంటికెళ్ళి తొందరగా పావుశేరు పాలు పట్టుకునిరా నీకు పాలకోవాచేసి పెడతాను!" అంది. వీరేశం పాలకోవా మీద ఆశతో ఆదెమ్మ ఇంటికి పరిగెత్తుకెళ్ళి పాలు తీసుకుని వీరవేగంతో తిరిగి వచ్చేశాడు.
"పాలేవిరా!"అడిగింది తల్లి వింతగా "కేబులో పోసుకుని తెచ్చానమ్మా! జేబులో వేసుకుంటే ఏ వస్తువైనా భద్రంగా వుంటుందని మొన్న బఠాణీలు క్రింద పడిపోయినప్పుడు నాన్న చెప్పాడు. అది బాగా గుర్తు పెట్టుకున్నాను" అని తన జేబుకేసి చూసుకున్నాడు వీరేశం. ఆ తల్లికి ఏం మాట్లాడాలో తోచలేదు. "పోరా పిచ్చి పుల్లయ్య" అన్నాడు. తండ్రి కొడుకుని కోపంగా చూస్తూ ఆ తర్వాత ఆ దంపతులకు కొడుకుకి చదువు చెప్పించడం చాలా అవసరమని తెలిసొచ్చింది.