పుర్రెతో పుట్టిన బుద్ధి


పరమ పిసినారి జమిందారు సర్వారాయుడికి ఎప్పుడైనా గుడికి వెళ్తే పూజారికి దక్షిణగా ఏదైనా ఇప్పటం, దేవునికి కొబ్బరికాయ పగలకోట్టడం, పాదరక్షల కాపల కుర్రాడికి ఏదైనా ఇవ్వడం ఇష్టముండేది కాదు.
జమీందారు పిసినారితనం బాగా ఎరిగిన పూజారి సోమనాథశాస్త్రి ఆయనను నోరెత్తి ఏమీ అడిగేవాడు కాదు.

ఓ మహాశివరాత్రి పర్వదినాన జమీందారు సర్వారాయుడు మొదట వ్యక్తిగా గుడికి రావడమే కాకుండా పూజారి శాస్త్రికి ఒక కానీ దక్షిణగా పళెంలో వేశాడు. అంత చిన్న బోణీతో మనసు బాధపడ్డ పూజారిశాస్త్రి "జమీందారుతో తమవంటి గొప్పవారినుండి 'కానీ' దక్షిణగా స్వీకరించడం నాకు ఎంతో అవమానంగా వుంది! దయచేసిమరొక కానీ దక్షిణగా ఇవ్వండి!" అన్నాడు. ఆ మాటలతో ఒళ్ళుమండిన సర్వారాయుడు "ఇంకొక కాస్ ఇచ్చి మళ్ళీ రెండోసారి మిమ్మల్లి అవమానపరచటం నాకూ ఇష్టం లేదు" అంటూ ఇచ్చిన కానీ వెనక్కి తీసుకుని గుడి బయటకు నడిచాడు.