తనకుమాలిన ధర్మం


అనగా అనగా ఒక రాజుగారు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చేరు. ఏడు చేపలు తెచ్చి ఎండబెట్టేరు వాటిలో ఒక చేప ఎండలేదు. "వన్నెల చిన్నెల వగలాడి చేపా? ముచ్చటయిన ఓ ఏడవ చేపా ? ఎందుకు ఎండలేదే?” అని అడిగాడు.

ఏడవ రాకుమారుడు రాజ్యమేలే రాజుకు మురిపెము గూర్చే ముద్దుల కొడుకో! బుట్టి రాకుమారా! గడ్డి. నాకు చాటొచ్చింది అందుచేత నేను ఎండలేదు" అన్నది చేప " ఔరా గడ్డిమోపా చేపకు చాటెందుకొచ్చావే " అని అడిగాడు.
"ధరణీని పాలించే ప్రభువుకు ముద్దుల కొడకా ఆవు నన్ను మెయ్యలేదు" అన్నది గడ్డి, "కాగా ఆవా! ఏమే ఆవా ఎందుకు నువ్వు గడ్డిమెయ్యలేదు?" అని అడిగాడు. "అరుగురన్నల అందాల తమ్ముడా! మమ్మేలు రాజుల ఆఖరి కొడుకా! గొల్లవాడు నాకు మేతెయ్యలేదు" అంది. "గొల్ల గొల్లా పాలు పెరుగులు మాకిచ్చేది. ' అవుకు మేతెందుకు వెయ్యలేదు" అన్నాడు.

"ఓ రాజకుమారా! రాజుగారి చిన్నోడా అన్న నాకు బువ్వ పెట్టలేదు" అన్నాడు. "ఏమి అన్న గొల్లకు బువ్వ పెట్టలేవేమే' అన్నాడు చిన్నరాజు. 'నా చిన్న మనవడు ఏడుస్తుంటే ఊరుకో బెడుతున్నాను బాబు" అంది. "యేరా మనవడా! ఆకతాయి మనవడా! ఎందుకేడుస్తున్నావురా? అనడిగాడు రాకుమారుడు "చీమకుట్టి నేనేడుస్తున్నాను. ఓ బుల్లి రాజు" అన్నాడు. "సమే చీమా ఎందుకే కుట్టేవు" అని రెట్టించి అడిగాడు ఏడవ కుమారుడు. "నా బంగారు కన్నంలో వ్రేలు పెడితే కుట్టనా" అంది చీమ

తనకు మాలిన పనులు చేస్తే ఊరువాడా అందరికి పని చెరుపే ఔతుంది.