సామెతలు



1. ఆదిలోనే హంస పాదు

2. చంద్రునికో నూలు పోగు

3. అడుసు తొక్కనేల కాలు కడుగనేల !?

4. రాజుల సొమ్ము రాళ్ళ పాలు.

5. తాతకు దగ్గడం నేర్పడం.

6. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.

7. మేక వన్నె పులి

8. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో

9. చెప్పులోని రాయి చెవిలోని జోరీగ.

10. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు

11. ఎంత చెట్టుకు అంత గాలి.

12. పొరుగింటి పుల్ల కూర రుచి.

13. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం.

14. ఊరిలో పెండ్లికి.. కుక్కల సందడి

15. అడుక్కున్నోనికి అరవై ఆరు కూరలు.

16. అడవి కాచిన వెన్నెల

17. నమ్మకం లేని అమ్మ కు సుఖం లేదు.

18. పెద్దల మాట చద్దన్నం మూట.

19. ఇంటికి దీపం ఇల్లాలు.

20. గుడొచ్చి పిల్లను వెక్కిరించినట్లు

21. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

22. ఇంట గెలిచి రచ్చ గెలువు

23. ఇల్లు పీకి పందిరేసినట్టు

24. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

25. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

26. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

27. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

28. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

29. కోటి విద్యలూ కూటి కొరకే

30. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

31. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

32. అమ్మ కడుపు చూస్తుంది-ఆలి జేబు చూస్తుంది

33. అమ్మ దీవెన ఆకాశమంత - దేవుడి దీవెన దీపమంత.

34. తల్లికి కూడు పెట్టనివాడు తగుదునని తగవు తీర్చవచ్చాడట.

35. తల్లి గూనిదైతే తల్లి ప్రేమ గూనిదౌతుందా?

36. తల్లి చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా?

37. తల్లి దైవము. తండ్రి ధనము.

38. తల్లిని బట్టి బిడ్డ, నూలును బట్టి గుడ్డ

39. తల్లికి గంజి పోయనివాడు పినతల్లికి చీర పెడతాడట.

40. అసలైన అమ్మకు ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తుంది.

41. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు

42. అందితే సిగ...అందకపోతే కాళ్లు

43. అమ్మబోతే అడివి...కొనబోతే కొరివి

44. అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు?

45. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయింది...

46. అరచేతిలో వైకుంఠం చూపినట్లు , అంధునకు అద్దం చూపినట్లు

47. మొగుడు మొట్టితే ఏడవలేదు గాని, తోడికోడలు నవ్విందని ఏడిచిందట

48. ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు

49. ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట!

50. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ

51. అరనిమిషం తీరికాలేదు అరకాను సంపాదనా లేదు

52. ఆడలేనమ్మ మద్దెల ఓదన్నట్లు

53. ఉన్న ఊరు కన్నతల్లి వంటిది.

54. ఎవడికంపు వాడికి ఇంపు

55. ఏ రాయి అయితేనేమి పండ్లూడగొట్టు కొనడానికి

56. కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు

57. కొంగ జపము చేపల కొఱకే

58. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు

59. గబ్బిలాయి మొగం నవ్వినా ఒకటే,ఏడ్చినా ఒకటే

60. చదివేది రామాయణం పడగొట్టేది దేవాలయం

61. తింటే ఆయాసం తినకుంటే నీరసం

62. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవు

63. దానాలలో కెల్లా నిదానం శ్రేష్ఠం.

64. దున్నను పోతే దూడల్లోనూ, మేయను బోతే ఎద్దుల్లోనూ

65. నడమంత్రపు సిరి నరం మీది పుండు భరింపరానివి

66. నెమలి కంట నీరు వేటగానికి ముద్దా?

67. నొసట నామాలు నోట బండబూతులు

68. మంచి కొంచెమైనా చాలు విత్తనం చిన్నదైనా చాలు

69. మాఇంటికొస్తే మాకేం తెస్తావు? మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు?

70. వెట్టి వేయి విధాలు పైత్యం పదివేల విధాలు

71. సూర్యుని మొగానే దుమ్ము చల్లితే ఎవరి కంట బడుతుంది?

72. అయితే ఆవలి ఒడ్డు కాకుంటే ఈవలి ఒడ్డు.

73. కొత్తలు లేకున్నా వెంట్రుకలకు అత్తరు నూనె పెట్టుకున్నట్లు.

74. ఒక్క చెయ్యి తట్టితే చప్పుడగునా?

75. కుండ మోయనోడు బండమోయ పోయినట్లు.

76. కానుగ నీడ కన్నతల్లి నీడ.

77. తాడు చాలదని బావి పూడ్చినట్టు.

78. రంగారెడ్డి జిల్లాకు అంగూరు పండ్లు అమ్మబోయినట్లు.

79. చేత కాని వానికి కూతలెక్కువ, వంటరాని వానికి వంక లెక్కువ.

80. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత.

81. నోరున్న వానికి ఊరు అప్పజెప్పినట్లు.

82. గతిలేని వాడు గాడిద కాలు పట్టుకున్నట్లు.

83. ఏడు మెతుకులు తింటే ఏనుగంత సత్తువ.

84. ఏమిటికి ఏమి లేదు మూడిటికి ఎసరు.

85. 'అ,ఆ'లు రావుగాని అగ్రతాంబూలం మాత్రం కావాల!

86. అంకె అయితే గొంగెడు తెమ్మన్నానుగానీ, మంచెగుంజల పాలు కమ్మన్నానా?

87. అంకెకురాని ఆలిని ఆర్గురు బిడ్డలతల్లైనా విడవాలె/అంకెకురాని ఆలు, కీలెడలిన కాలు.

88. అంకెలేని కోతి లంకంతా చెడిచిందిట.

89. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిఉంది/అంగట్లో అష్టభాగ్యం,అల్లుని నోట్లో శనేశ్వరం.

90. అంగట్లో అరువు, తలమీద బరువు.

91. అంగట్లో ఎక్కువయితే ముంగిట్లో కొస్తుంది.

92. అంగట్లో బెల్లానికి గుళ్ళో లింగానికీ నైవేద్యం

93. అంగడి అమ్మి గొంగడి కప్పుకొన్నట్లు.

94. అంగిట బెల్లం, ఆత్మలో విషం.

95. అంచనగాడికి పుట్టి ఆతుతో సమానం.

96. అంచుడాబే కాని, పంచెడాబు లేదు.

97. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు.

98. అంటుకోను ఆముదంలేకుంటే, మీసాలకు సంపంగినూనె.

99. అంటూసొంటూ ఆసాదివానిది, రట్టూరవ్వా గంగానమ్మది.

100. అంటే ఆరడి అవుతుంది, అనకుంటే అలుసవుతుంది.

101. అండ బ్రతుకూ, ముండ బ్రతుకూ అదవే!

102. అండలుంటే కొండలు దాటవచ్చును

103. అండలేని వూళ్ళో వుండదోషము, ఆశలేని పుట్టింట అడుగ దోషం

104. అంత ఉరిమీ ఇంతేనా కురిసేది?

105. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత

106. అంతంత కోడికి అర్ధశేరు మసాలా.

107. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు.

108. అంత పెద్దకత్తి ఉన్నదే, గొరుగలేవా అన్నట్లు.

109. అంతమాత్రమా కొడకా, చెవులుపట్టుక తడవేవు అన్నట్లు.

110. అంతమాత్రముంటే, దొంతులతో కాపురం చేయనా?

111. అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.

112. అంతర్వేది తీర్థంలో మా వెధవ మేనత్తను చూసావా?

113. అంతా అయిన తర్వాత,ముద్దరపిండికాడనా తగువు?

114. అంతా అయిన తర్వాత రంతు పెట్టుకొన్నట్లు.

115. అంతా అర్ధుము అమ్మితే, అత్తనుకానక కోడలు ముత్తుము అమ్మింది.

116. అంతా తెలిసినవాడు లేడు, ఏమీ తెలియనివాడూ లేడు.

117. అంతా బావలే! అయితే కోడిపెట్ట ఏమయినట్లు?

118. అంతామావాళ్లేగాని, అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.

119. అంతేనోచిపుట్టావురా, అవుసల తొట్టివాడా!

120. అంత్రునికి ఆశ పెట్టరాదు, బలవంతునికి చోటు పెట్టరాదు.

121. అంత్యనిష్టూరం కన్నా, ఆదినిష్టూరం మేలు.

122. అందంచందం లేని మగడు మంచం నిండా ఉన్నట్లు.

123. అందం చిందినట్లు, నాగరికత నష్టమైనట్లు.

124. అందగానికి ముందు పెళ్లి, అందరితోనూ మళ్ళీ పెళ్లి.

125. అందతుకుల కాపురము, అరదళ్ళ నీటి సేద్యము

126. అందతుకుల మొగవానికి చీకుల మొలతాడు.

127. అందని ద్రాక్షపళ్ళు పుల్లన/అందని పూలు దేవునికర్పణ.

128. అందనిమ్రాని పండ్లకు, అర్రులు సాచినట్లు.

129. అందమయిన ఈకలే అందమైన పిట్టలను చేసేది.

130. అందమున కోతిపిల్ల ఈ అరవపిల్ల.

131. అందములోపుట్టిన గంధపు చెక్క, ఆముదములో పుట్టిన ముడ్డి.

132. అందముంటే ఆయెనా ? అదృష్టము ఉండవద్దా

133. అందరమ్మా అంటే పొందరమ్మా అన్నట్లు.

134. అందరికన్నా తాటిచెట్టు పెద్ద.

135. అందరికాళ్ళకు మొక్కినా, అత్తగారింటికి పోక తప్పదు.

136. అందరికి శకునం చెప్పే బల్లి, తానుపోయి కుడితిలో పడినట్లు.

137. అందరికీ అట్లపండుగ, మనకు ముట్ల పండుగ.

138. అందరికీ అన్నం పెట్టేవాడు రైతే!

139. అందరికీ అన్ని రోగాలు,అడ్డెడు తప్పేలాకు ఏరోగమూ లేదు.

140. అందరినీ మెప్పించడం అలవిగాని పని.

141. అందరికీ నే లోకువ, నాకు నందికొండాయ లోకువ.

142. అందరి పుణ్యాన ఆలాయె, కొందరి పుణ్యాన కొడుకాయె.

143. అందరూ అందలమెక్కితే, మోసేవారెవరు?

144. అందరూ ఆ బుర్రలో విత్తనాలే!

145. అందరూ ఇర్రికొమ్మంటే, తాను బర్రికొమ్మంటాడు.

146. అందరూ ఒక ఎత్తు. అగస్త్యుడు ఒక ఎత్తు

147. అందరూ ఘనులైన హరునికి తావేది?

148. అందరూ నవ్వినట్లే నేనూ నవ్వితే, నాపై బడెనమ్మా నాలుగు సుస్కానీల దండుగ!

149. అందరూ మాటలు చెప్పేవారేకానీ, ఆ పూటకు బత్తెమిచ్చేవారు ఒకరూ లేరు.

150. అందరూ మంచాల దగ్గరకు వెళ్ళేవరకు మేము కంచాల దగ్గరకైనా వెళ్ళలేమా?

151. అందరూ శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలెగిరిపోతున్నాయి.

152. అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అక్కరకొస్తుంది.

153. అందానికి రెండు బొందులు, ఆటకు రెండు తాళాలు

154. అందుకోనే లేకుంటే,తుంచుకోనెక్కడిది?

155. అందులో పస లేకున్నా, అరలో మంచంవేయమన్నట్లు.

156. అంధునికి అద్దం చూపినట్లు.

157. అంబటికి ఉప్పు అబ్బదంటే, పిండివంట మీదకి మనసు పోయినట్లు.

158. అంబలి తాగేవాడికి మీసాలెగబెట్టే వాడొకడు.

159. అకటావికటపు రాజుకు అవివేకి ప్రధాని, చాదస్తపు పరివారము.

160. అక్కచెల్లెళ్ళకు అన్నము పెట్టి లెక్క వ్రాసినట్లు.

161. అక్కరకు ఒదవని అర్ధమెందుకు? అక్కరకురాని చుట్టమెందుకు?

162. అక్కరకు వచ్చినవాడే అయినవాడు.

163. అక్కరగడుపుకొని, తక్కెడ పొయిలో పెట్టినట్లు

164. అక్కర తీరితే, అక్కమొగుడు కుక్క/అక్కర తీరితే అల్లుడు తొత్తుకొడుకు/అక్కర తీరితే, అల్లుడ శుద్ధంతో సమానము.

165. అక్కలు లేచేవరకు నక్కలు కూస్తాయి.

166. అక్కాజిపల్లి అంతా తిరిగినా, అరదుడ్డే గోవిందా!

167. అక్కున లేదు,చెక్కున లేదు, పీతిరికాళ్లకు పిల్లాండ్లు

168. అగడు మగడి పాలు, అనుభవం వూరి పాలు.

169. అగడ్తలో పడిన పిల్లికి అదే వైకుంఠం.

170. అగ్గికి చల్లదనం వచ్చినట్లు/ అగ్గిమీద గుగ్గిలం చల్లినట్లు.

171. అగ్గిచూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది.

172. అగ్గికి పోయినమ్మ, ఆరునెలల గర్భమైవచ్చినట్లు.

173. అగ్గువ అయితే అంగడికి వస్తుంది.

174. అరువ కొననీయరు, తీవరం తిననీయరు

175. అగ్గువ బేరం నుగ్గునుగ్గు.

176. అగ్నికి వాయువు తోడైనట్లు.

177. అగ్నిదేవుడు చలికాలంలో చంటివాడు, ఎండకాలంలో ఎదిగినవాడు.

178. అగ్నిలో ఆజ్యం పోసినట్లు.

179. అగ్నిలో ఒక కాలు, గంధంలో ఇంకొక కాలు వుంచి తగవు తీర్చినట్లు.

180. అగ్నిలో మిడత పడినట్లు.

181. అగ్ని శేషం, రుణశేషం, శత్రుశేషం, ప్రణశేషం ఉంచరాదు.

182. అగ్రహారం పోతేపోయింది కాని, ఆక్టు అంతా బాగా తెలిసింది.

183. అగ్రహారంలో తంబళి జోస్యం

184. అచ్చ తిరుమణిధారి అయితే, పుల్ల పట్టడంలోనే తెలుస్తుంది.

185. అచ్చపు నేతి ముందర పచ్చివెన్న మెచ్చా?

186. అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.

187. అచ్చమైన సంసారి ఉచ్చబోసి ఇల్లలికిందంట.

188. అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చి గాడికో పోచ.

189. అచ్చిగాడు చావనీ అంటే, బుచ్చిగాడే చచ్చెనంట!

190. అచ్చిరాని కాలానికి అడుక్క తినబోతే, ఉన్న బొచ్చి కాస్తా ఊడ్చుకొని పోయిందంట.

191. అచ్చివచ్చిన భూమి అడుగే చాలు.

192. అచ్చివస్తే హనుమంతుడి మోర, లేకపోతే కోతి మోర.

193. అచ్చువేసిన ఆబోతువలె

194. అజీర్ణానికి ఆకలి మెండు.

195. అటుకులుదిన్న కడుపు కుట్టుకు ఓర్చుకోవలదా

196. అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.

197. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు.

198. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరును.

199. ఏటికి ఎదురీదినట్లు.

200. ఏదారి అంటే గోదారి అన్నట్టు.

201. ఏ పుట్టలో ఏ పాము వుంటుందో ఎవరికెరుక?

202. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలూ లేదూ.

203. ఒకడిని చూస్తే పెట్టబుద్ధి, ఇంకొకడిని చూస్తే మొత్త బుద్ధి.

204. ఏనుగును చూచి కుక్కలు మెరిగినట్లు.

205. ఏబ్రాసికి పని ఎక్కువ, దేబిరాసికి తిండి ఎక్కువ.

206. ఏరాయి అయితే ఏం ? పండ్లూడ గొట్టుకోవడానికి ?

207. ఏరుదాటాక తెప్ప తగులబెట్టే రకం.

208. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.

209. ఒక్కొక్కరాయి తోస్తుంటే కొండయినా తరుగుతుంది.

210. ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డు చేరిన తర్వాత బోడి మల్లయ్య.

211. ఒట్టి గొడ్డుకు అరుపులెక్కువ.

212. ఓటి కుండలో నీరు పోసినట్లు.

213. ఓర్పు గలవారే భూవి నేల గలరు.

214. ఓంకారము లేని మంత్రం అధికారము లేని ప్రజ్ఞ.

215. ఆకార పుష్టి నైవేద్య నష్టి.

216. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.

217. ఆకు నలిపి నప్పుడే అసలు వాసన బయటపడేది.

218. ఆకారం చూసి ఆశపడ్డానేగాని అయ్యకు అందులో పసలేదని నాకేమి తెల్సు.

219. ఆకులు ఎత్తరా అంటే, విస్తళ్ళు లెక్కబెట్టినట్లు.

220. అగ భోగాలు అంకాలమ్మవి, పొలికేకలు పోలేరమ్మవి.

221. ఆచారినికి ఆరు బారలు, గోచి పాత మూడు బారలు.

222. ఆచారం చెప్పిన పెద్ద మనిషి ఆకూటికే వచ్చాడట.

223. ఆచారినికి అంతం లేదు, ఆనాచారానికి ఆదిలేదు.

224. ఆచార్యుడికి ద్రోహం చేసినా ఆత్మకు ద్రోహం చేసుకోరాదు.

225. ఆటాపాటా మాయింట, మాపటి భోజనం మీయింట.

226. ఆడదాని నోటిలో నువ్వు గింజ నానదు.

227. ఆడదానికి పురిటి గండం, మగాడికి దినదిన గండం.

228. ఆడదాన్ని చూచినా, అర్ధాన్ని చూచినా బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు.

229. ఆడది బొంకితే గోడ పెట్టినట్లు, మగవాడు బొంకితే తడిక పెట్టినట్లు.

230. ఆడదే అమృతం, ఆడదే హలాహలం.

231. ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుట్టేది మేలు.

232. ఆడపడుచు ఉసూరుమంటే ఆరుతరాలు అరిష్టం.

233. ఆడలేక పాత గజ్జెలు అన్నట్లు.

234. ఆడలేక మద్దెల వానిపై గోడు పోసుకున్నట్లు.

235. ఆడగబోయిన తీర్ధమెదురైనట్లు, వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్లు, మొక్కబోయిన దేవుడు ఎదురైనట్లు.

236. ఆడి తప్పరాదు, పలికి బొంకరాదు.

237. ఆడింది ఆట, పాడింది పాట.

238. ఆడే కాలు, పాడే నోరు ఊరికే వుండవు.

239. ఆత్రగానికి బుద్ధి తక్కువ.

240. ఇంటి ఎద్దుకు బాడుగేముంది ?

241. ఇంటికళ ఇల్లాలే చెపుతుంది. అమ్మకళ గుమ్మంలోనే తేలుతుంది.

242. ఇంటికి ఇత్తడి, పొరుగుకు పుత్తడి.

243. ఇంటికి ఒక పువ్వు, ఈశ్వరుడికొక దండ వుండాలి.

244. ఇంటికి పెద్ద కొడుకై పుట్టే కన్నా అడవిలో తుమ్మమానై పుట్టేది మేలు..

245. ఇంటికి గుట్టు మడికి గట్టు ఉండాలి.

246. ఇంటి గుట్టు లంకకు చేటు.

247. సముద్రంకన్నా సహనం పెద్ద

248. అన్నం తిన్నవారు.. తన్నులు తిన్నవారు మరిచిపోరు

249. అరచేతిలో వెన్నబెట్టుకుని.. నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్లు

250. ఉత్తర చూసి ఎత్తర గంప