విద్యాసాగరుని కథ



అందువలన నేనొకనాడు ఎవ్వరికీ చెప్పకుండా, విద్య నేర్వాలన్న పట్టుదలతో యిల్లు విడిచి బయలుదేరాను, ఎంతమందినో ఆశ్రయించాను. కానీ, నా కోరిక తీరలేదు. అయిననూ నా పట్టువిడవక బయలుదేరాను. ఒక అడవిలో నొక బ్రహ్మరాక్షసి వలన సకల విద్యలు నేర్చుకొన్నాను. నాకు విద్యలు నేర్పిన ఆ బ్రహ్మరాక్షసి శాపం వలన బ్రహ్మరాక్షసి, కాని, నిజముగా ఆయనొక గంధర్వుడు. శాపము దీరి ఆయన నన్ను దీవించి తనలోకమునకు వెళ్ళిపోయినాడు. నేను ఆయన సెలవుపొంది యింటికి బయలు దేరినాను. మధ్యమార్గమున నిద్రలేమివలన, ఆహార లోపమువలన అలసటతో మీ యింటి అరుగుపై పరున్నాను" అని తెలియజేసినాడు.

ఆతని వాక్యములకు ఆ తల్లీ కూతుండ్రు మిక్కిలి ఆనందించినారు. చిత్రరేఖ ఆతనికి తన కోరిక వెల్లడిస్తూ "తనను ప్రేమించుమని. పెండ్లాడుమని" ప్రార్ధించినది. తల్లికూడ తన ఆమోదము తెలిపినది.

అందులకు ఆ బ్రాహ్మణ యువకుడు "చిత్రరేఖాః నేను బ్రాహ్మణ వంశమున జన్మించినవాడను- నీవు వేశ్యకులమున జన్మించినదానవు. పర పురుష సంపర్క మెరుంగని కన్యకవే అయినా, నా మనస్సు అంగీకరించుట లేదు. బ్రాహ్మణ కన్యకవే అయితే ఆనందంతో స్వీకరించేవాడను. ఇక-నీవు నాకు ఎందయో పరిచర్యగావించి నాకు ఆనందం కలిగించావు. ఇందుకు నేను నికెంతయో ఋణపడియున్నాను. ఇందుకు ప్రత్యుపకారం "పెండ్లిమాట" తప్పించి కోరుకొనుము- తప్పక తీర్చి ఋణవిముక్తుడనగుతాను" అని సమాధానము చెప్పాడు.