వ్యర్థ ఉపకారం



ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలితాన్ని, సంతృప్తినిస్తుం ది. ఆల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వలన ప్రయోజనం ఉండదు.

ఈకొంగ కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నది. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తింది. చివర్లో ఒక ఎముక ముక్క దాని గొంతుకు అడ్డుపడింది. ఆది తీసుకోలేక, మింగలేక నానా అవస్థా పడింది. అది క్రమేపీ ఎంతో బాధించింది.

దారిన వచ్చేపోయే జ౦తువులన్నిటినీ ఆ తోడేలు తనకు ఈ బాధను తప్పించాలని కోరింది. కానీ దాని నైజం తెలిసి ఏ చిన్న వ్యర్థ ఉపకారం జంతువూ, పక్షి కూడా దాని దగ్గరకు వెళ్ల లేదు. చివరికి ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థ గమనించింది. అయ్యో ఇది నిజంగానే బాధపడుతోందని జాలిపడింది.

దాని బాధ నివృత్తి చేస్తే లబ్ది పొందవచ్చుననుకుంది.తోడీలు దగ్గరికి వెళ్లి నోరు తెరచి ఉంచమంది. తన పెద్దముక్కును నోటిలోకి దించి ఆ ఎముక ముక్కను తీసేసింది. తోడేలు 'హమ్మయ్య' అనుకుంది.

ఎంతో సాయం చేశావని కొంగను మెచ్చుకుంది. "నీకు అంత సాయం చేస్తే ఒక్క మాటతో సరిపెట్టుకుంటావా "అంది కొంగ దాని అమాయకత్వానికి నవ్వుకుని తోడేలు, "ఆమాయకురాలా! నా బాధను తప్పించావు గనుక నిన్ను క్షమించి వదిలేశాను, లేకపోతే నా నోట్లోకి పెట్టిన నీ తలను కారికి ఫలహారంగా లేకకాదు. బతికిపోయావు. వెళ్లిపో... అంది.

తోడేలు బుద్ధికి కొంగ ఎంతో నొచ్చుకుంది.
ఇలాంటి దుష్టుడికి సాయం ఎందుకు చేశానా అనుకుంది