చంద్రగుప్త ఆదిత్యుడు



పూర్వకాలము అనగా యిప్పటికీ పదహారు వందల సంవత్సరముల క్రిందట- ఉజ్జయినీ నగరాన్ని చంద్రగుప్త ఆదిత్యుడనే రాజు పాలించేవాడు. ఈతనికే చంద్రవర్ణ ఆదిత్యుడని పేరుకూడ ఉండేది. ఈ ఉజ్జయినీ నగరంలో చిత్రరేఖయను ఒక వేశ్య ఉండేది. ఆమె కులమున వేశ్యగా బుట్టినను మంచి శిలము గలిగి ఉండేది. చిత్రరేఖతల్లి మదన రేఖ కూతురును కుల వృత్తిరీత్యా ఆమెకు ఏ మహారాజుచేతనో, చక్రవర్తి అంతటి ధనవంతుని చేతనో కన్నెరికము చేయించి చిత్రరేఖను ఒక వేశ్యగా చేయాలని ఆలోచించెడిది.

చిత్రరేఖ మిక్కిలి అందగత్తె. అందుకు తగిన విద్యాబుద్ధులు కూడా ఆమెకు వన్నె తెచ్చినవి. ఆమె గుణగణములు గూర్చి, అందమును గూర్చి ఎందరెందరో మహా రాజకుమారులకు తెలిసినది. అందువలన చిత్రరేఖను పెండ్లాడవలయునని, కనీసము ఆమెను తమ రాజస్థానమున నర్తకిగా చేసుకోన వలయుననియు ఉర్రూతలూగేవారు. చిత్రరేఖ మాత్రం అందుకు సమ్మతించేది కాదు. తల్లి యగు మదనరేఖ ఆమెను ఉపయోగించుకొని, బాగా ధనము గడించాలని అనుకొనేది. కానీ, చిత్రరేఖ ఈ విషయంలో తల్లిని ఎదిరించి, తానొక సంసారిక జీవితమునే గడుపవలెనని నిశ్చయించుకొన్నది. సకల శాస్త్రములు తగిన గురువుల వద్ద అభ్యసించి “చదువుల సరస్వతి"గా విరాజిల్లినది. అట్టి సమయంలో ఒకనాడు ఒక బ్రాహ్మణ యువకుడు ప్రయాణము చేయుచూ వచ్చి, చిత్రరేఖ మందిర ప్రాంగణములో ఆ రాత్రి శయనించినాడు. ఎన్ని రాత్రుల నుండియో నిద్రలేక పోవుటవల్లనో ఏమో రాత్రి నిదురబోయిన ఆ బ్రాహ్మణ యువకుడు సూర్యోదయమైనను ఆ మందిరపు అరుగుమీదనే పండుకొనియున్నాడు.

ఉదయమున దాసీలు ఊడ్చుటకు వచ్చి. అతనిని జూచి మదన రేఖకు విన్నవించారు. ఆమె కూతురగు చిత్రరేఖతో వచ్చి- ఆ బ్రాహ్మణ యువకుడిని చూచినారు. నవమన్మథాకారుడైన అతని సోయగమును గాంచి చిత్రరేఖ ఎంతయో ఆనందించినది, మనసారా ప్రేమించినది.. అందువలన, ఆమె కోరికతో తల్లి మదనరేఖ అతనిని తమ మందిరంలోనికి సేవకులతో చేర్పించి, శీతలోపచారములు చేయించిరి. కొంత సేపటికి వారి ఉపచర్యలవల్ల బ్రాహ్మణ యువకుడు నిద్రనుండి మేల్కొని వారిని గాంచి "ఎవరు మీరు? నేనీ హంసతూలికా తల్పమునకు ఎట్లు వచ్చితినిః నన్నీ విధంగా సేద దీర్చినందులకు మీకెంతయో కృతజ్ఞుడును" అని పలికెను.

ఆ బ్రాహ్మణ యువకునకు మెలకువ వచ్చినప్పటికి, ఆతని ప్రక్కన చిత్రరేఖయే యుండెను. అందువలన ఆమె- అతనిని జూచి "మహాత్మా! మేమే యిక్కడకు చేర్చితిమి. మీరు నాలుగు, ఐదు రోజులనుండి నిద్రలేనట్లుంది; గాఢంగా నిద్ర పోపుచున్నారు, మీ నిద్రకు భంగం రాకుండా, మీకు ఎట్టి ఆటంకము కలుగకుండా నేను చూచుచున్నాను. నా పేరు చిత్రరేఖ. కులమున వేశ్యను, మీరెవరు, ఏ గ్రామము నుండి వచ్చితిరి ? ఎందులకు వచ్చితిరి ?" అని ఆప్యాయముగా అడిగినది.

అప్పుడా బ్రాహ్మణ యువకుడు- "చిత్రరేఖా! నేను బ్రాహ్మణ వంశమున పుట్టినవాడను. పేరు విద్యాసాగరుడు, పేరులోనే విద్యగలదు కానీ, నాకు ఏ విద్యా నాకు సరిగ్గ రాదు. అందువలన తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, స్నేహితులు నన్ను ఎంతో హేళన చేసేవారు. నన్నొక తృణమును జూచినట్లు చూచి, అగౌరపరిచేవారు.

చంద్రగుప్త ఆదిత్యుడు

మరిన్ని కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


2.విద్యాసాగరుని కథ

3.మదనరేఖ మహారాజును దర్శించుట

4.విద్యాసాగరుని వివాహములు

5.విక్రమార్కుడు వేటకు బయలుదేరుట

6.గూఢచారి విక్రమార్కునికి కాళికాదేవి గురించి తెలియజేయుట

7.విక్రమార్కుడు కాళికాదేవి ఆలయము దర్శించుట

8.విక్రమార్కుడు ఉట్లను ఖండించుట

9.కాళీమాత సాక్షాత్కారము

10.భట్టియుక్తి — వేయిని' రెండు వేలుగా మార్చుట

11.సన్యాసి-విక్రమార్కుడు

12.విక్రమార్కుడు సన్యాసితో బయలుదేరుట

13.సదానందుని కథ

14.రాక్షసుని కోరిక

15.సత్యవ్రతుని కథ

16.సత్యవ్రతుడు తన వాగ్దానం నిలుపుకొనుట

17.ప్రతాపసేనుని కథ

18.ప్రతాపసేనుని రాజభక్తి

19. పుండరీకుని కథ

20. విజ్ఞాన హీనుల కథ

21. నిర్మల రాగమల్లుల కథ

22.శారదా విశ్వదత్తుల కథ

23.నచికేతుని కథ

24.శంఖ చూడుని కథ

25.మిత్రావసువుచెప్పిన నాగసంతతి కథ

26.సత్యశీలుని కథ

27.నంద గోపాలుని కథ

28.గంగాధరుని కథ

29.కమలాక్షి కథ

30.సన్యాసి - ధీరేంద్రుల కథ

31.వేదశర్మ కథ

32.వ్యాఘ్ర - భల్లూకముల కథ

33.భేతాళుడు చెప్పిన ఆఖరికథ

34.భేతాళుని హితోపదేశం